: యూపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసంలో చోరీ


ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ శాసనసభ్యుడు నదీం అహ్మద్ నివాసంలో చోరీ జరిగింది. సుఖిపూర్ లోని ఎమ్మెల్యే నివాసంలో గతరాత్రి దుండగులు ప్రవేశించి నగదు, విలువైన వస్తువులను అపహరించారు. కాగా, చోరీ జరిగిన సమయంలో ఎమ్మెల్యేగానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ ఎవరూ ఇంట్లో లేరు. దీనిపై, ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నదీం అహ్మద్ సదర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News