: తెలంగాణ టీడీపీ నేతలతో బాబు సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై వారితో చర్చించారు. క్షేత్రస్థాయి నుంచి అమలు చేయాల్సిన ప్రణాళికపై నేతలు చెప్పిన పలు సూచనలను ఆయన విన్నారు. కాగా, ఈ సమావేశంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కూడా పాల్గొన్నారు. భేటీ సందర్భంగా తెలంగాణ నేతలు వరంగల్ విమానాశ్రయాన్ని డెవలప్ చేయాలని, వరంగల్-తిరుపతి నడుమ విమానాలు నడపాలని గజపతిరాజును కోరారు.