: ఇరు రాష్ట్రాల సీఎంల భేటీపై దత్తాత్రేయ స్పందన
ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు రేపు భేటీ కానుండడంపై ఎంపీ బండారు దత్తాత్రేయ స్పందించారు. ఈ విషయంలో గవర్నర్ నరసింహన్ చొరవ చూపడం తెలివైన పనన్నారు. కానీ, ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇరు రాష్ట్రాల సీఎంలు విభేదాలను పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెడతారని తాను భావిస్తున్నానన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ పుష్కలమైన సహజ వనరులు, మానవ వనరులు ఉన్నాయని, అభివృద్ధి చేసేందుకు కేంద్రం కూడా నిబద్ధతతో ఉందని చెప్పారు. ముఖ్యమంత్రులు కూడా తమ రాష్ట్రాలకు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని, కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలని సూచించారు.