: బీజేపీని గెలిపించింది కాంగ్రెస్ పార్టీనే: అద్వానీ


ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీనే అని బీజేపీ అగ్రనేత అద్వానీ అన్నారు. గత పదేళ్ల నుంచి కాంగ్రెస్ నేతలు చేసిన అంతులేని అవినీతి, తప్పిదాలు ఆ పార్టీకి ప్రజా మద్దతును దూరం చేశాయని చెప్పారు. దీనికి తోడు, నరేంద్ర మోడీ ప్రచారం బీజేపీకి ఎంతో లాభించిందని అభిప్రాయపడ్డారు. ఏ రకంగా చూసినా బీజేపీ విజయంలో కాంగ్రెస్ పార్టీ పాత్రే ఎక్కువగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీ తరం కాదని తెలిపారు.

  • Loading...

More Telugu News