: దర్శకుడు బాలచందర్ కుమారుడు కైలాసం మృతి
ప్రముఖ దర్శకుడు బాలచందర్ కుమారుడు కైలాసం మృతి చెందారు. 54 ఏళ్ల కైలాసం గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కైలాసం పరిస్థితి విషమించడంతో, ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన పార్థివదేహాన్ని స్వగృహానికి తరలించారు. కైలాసం భౌతికకాయాన్ని సందర్శించేందుకు, బాలచందర్ ను ఓదార్చేందుకు తమిళ సినీ ప్రముఖలు తరలుతున్నారు.