: స్వతంత్ర భారతావనిలో తొలిసారి జెండా పండగ చేసుకున్న గ్రామం
68 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో వరంగల్ జిల్లాలోని ఓ గ్రామం తొలిసారి జెండా పండగ చేసుకుంది. అదేంటి..? స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా స్వాతంత్ర్యదినోత్సవం జరుపుకోకపోవడమేంటనేదేగా మీ అనుమానం. చిట్యాల మండల శివారులోని కురుమపల్లికి సరైన రహదారి లేదు, స్కూల్ అసలే లేదు... దీంతో, జెండా ఎగురవేసేందుకు ఎవరూ వచ్చేవారు కాదు. జెండా కట్టడం, ఎగురవేయడం గురించి గ్రామస్తులకు ఏమాత్రం అవగాహన లేదు. దీంతో, ఇన్నేళ్లుగా ఆ గ్రామంలో మువ్వన్నెల పతాకం రెపరెపలాడలేదు. ఈ ఏడాది రోడ్డు వేయడంతో ప్రధాన కూడలి వద్ద జెండా ఎగురవేశారు. జెండా వందన కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొన్నారు. జెండా పండుగ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు.