: మా అమ్మానాన్నల నుంచి రక్షించండి... అంటూ పోలీసులనాశ్రయించిన ప్రేమజంట
తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఒక ప్రేమజంట కృష్ణా జిల్లా గంపలగూడెం పోలీసులను ఆశ్రయించింది. కేరళ రాష్ట్రానికి చెందిన సూరజ్, వరంగల్ జిల్లాకు చెందిన మానస ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ధైర్యంగా తల్లిదండ్రులకు తమ ప్రేమ విషయం తెలిపారు. ఐసెట్ లో అర్హత సాధించిన మానసను, తోటమూలలో టీ దుకాణం నడిపే సూరజ్ కు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు నిరాకరించారు. ఇంకోసారి సూరజ్ మాటెత్తితే సహించేది లేదని హెచ్చరించారు. దీంతో సూరజ్, మానస వేలాద్రి ఆలయంలో వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ గంపలగూడెం ఎస్ఐ మహాలక్ష్మిని ఆశ్రయించారు. ప్రస్తుతం ఆమె పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు.