: పవన్ కల్యాణ్ పంద్రాగస్టు సందేశం


నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 68వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మీడియా ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 15 సందర్భంగా ప్రతి భారతీయుడికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మన ముందు తరాల వారి త్యాగాలను గుర్తు చేసుకునేందుకు ఇదో మహత్తరమైన సందర్భమని అన్నారు. మన స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడే క్రమంలో సాయుధ బలగాల అలుపెరుగని సేవలను స్మరించుకుంటూ శాల్యూట్ చేసేందుకు ఇది తరుణమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తితో మంచి పౌరులుగా, మంచి మనుషులుగా మసలుకుందామని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సూచించారు. జాతీయ సమగ్రత, బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని అందరూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. చివరగా 'జైహింద్' అని పేర్కొన్ని తన సందేశాన్ని ముగించారు.

  • Loading...

More Telugu News