: క్యాన్సర్ కణాల నిర్మూలనకు 'గోల్డెన్' ట్రీట్ మెంట్


ఆధునిక చికిత్స రీతులు అందుబాటులోకి వచ్చినా గానీ, ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎందరో బలవుతున్నారు. ఈ వ్యాధి ముదిరిందంటే ఇక కష్టమే. ఈ క్యాన్సర్ దాదాపు మానవ దేహంలోని అన్ని అవయవాలకు సోకుతుంది. మనిషిని నడిపించే మెదడుకు కూడా. అయితే, బ్రెయిన్ క్యాన్సర్ కు బంగారంతో చెక్ పెట్టవచ్చంటున్నారు యూకే పరిశోధకులు. బంగారం సూక్ష్మకణాలు క్యాన్సర్ కణితి కణజాలాన్ని సమర్థంగా నిర్మూలిస్తాయని వారి పరిశోధనల్లో తేలింది. బంగారం విడుదల చేసే ఎలక్ట్రాన్లు క్యాన్సర్ కణాల డీఎన్ఏ సహా వాటి నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి. ఇలా ల్యాబ్ లో పలుమార్లు పరీక్షించిన శాస్త్రవేత్తలు ఇరవై రోజుల తర్వాత ఆ క్యాన్సర్ కణాలు నిర్వీర్యమైపోవడాన్ని గమనించారు. త్వరలోనే ఈ బంగారం వైద్య విధానానికి ఆమోదం లభిస్తుందని వారు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News