: టీమిండియా క్రికెటర్లపై బాయ్ కాట్ తీవ్ర వ్యాఖ్యలు


ఇంగ్లండ్ మాజీ సారథి, క్రికెట్ వ్యాఖ్యాత జెఫ్రీ బాయ్ కాట్ టీమిండియా క్రికెటర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత జట్టులోని చాలామంది ఆటగాళ్ళు కాగితం పులులేనని ఎద్దేవా చేశారు. భవిష్యత్ ఆశాకిరణాలుగా ముద్రవేయించుకున్న కోహ్లీ, పుజారా వంటి ఆటగాళ్ళే అందుకు ఉదాహరణలని, వారు తాజా పర్యటనలో చేసింది శూన్యమని విమర్శించారు. మూడోస్థానానికి రాహుల్ ద్రావిడ్ ఎనలేని సేవలతో వన్నెతెచ్చాడని, అయితే, అతని రిటైర్మెంట్ తర్వాత ఆ స్థానానికి న్యాయం చేసేవాళ్ళు కరవయ్యారని విశ్లేషించారు. అశ్విన్ కు బదులుగా జడేజాను జట్టులోకి తేవడం ఘోరతప్పిదమని బాయ్ కాట్ పేర్కొన్నారు. జడేజా టెస్టుస్థాయికి ఇంకా ఎదగలేదని అన్నారు. టీమిండియాకు చెందిన మిలియనీర్ స్టార్లు ఇప్పుడు పరువు కోసం పాకులాడుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడీ ఇంగ్లండ్ దిగ్గజం. టూర్ ముగిసేలోగా సత్తా చాటితేనే వారి గౌరవం నిలుస్తుందని అన్నారు.

  • Loading...

More Telugu News