: కర్నూలు జిల్లాపై బాబు వరాల జల్లు


కర్నూలులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ఓర్వకల్లు వద్ద 30 వేల ఎకరాల్లో పారిశ్రామిక నగరం ఏర్పాటుకు నిర్ణయించామని తెలిపారు. అంతేగాకుండా, అక్కడ విమానాశ్రయం కూడా నిర్మిస్తామని తెలిపారు. ట్రిపుల్ ఐటీతో పాటు ఉర్దూ యూనివర్శిటీ, నిమ్స్ తరహాలో రాయలసీమ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో సోలార్, విండ్ ప్రాజెక్టులను భారీ ఎత్తున చేపడతామని తెలిపారు. జిల్లాలోని ఆలూరు వద్ద జింకల పార్కు, శ్రీశైలంలో టైగర్ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. జీవాలపై పరిశోధనకు సంస్థ నెలకొల్పుతామని అన్నారు. అయితే, ఇవన్నీ అమల్లోకి రావాలంటే శాంతిభద్రతలు మెరుగవ్వాల్సిన అవసరం ఉందని, అందుకు అన్ని వర్గాలు సహకరించాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News