: బౌలర్ గోనీ బ్యాటింగ్ విశ్వరూపం!
నరైన్ హ్యాట్రిక్ మాయాజాలంతో కుదేలైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును బౌలర్ మన్ ప్రీత్ గోనీ ఆదుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదో స్థానంలో వచ్చిన గోనీ కేవలం 18 బంతుల్లోనే 42 పరుగులు చేయడం విశేషం. జట్టు స్కోరు 99/6 వద్ద క్రీజులోకొచ్చిన ఈ ఆజానుబాహుడు 4 ఫోర్లు, 3 సిక్సులతో నైట్ రైడర్స్ ను బెంబేలెత్తించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగలిగింది.