: అమర జవాన్లకు నివాళులు అర్పించిన కేసీఆర్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్న అమర జవాన్ల స్థూపానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. అంతకు ముందు తన అధికారిక నివాసంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అమర జవాన్లకు నివాళి అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఆయన గోల్కొండకు బయలుదేరారు.