: స్క్రిప్ట్ లేదు... అయినా, ప్రసంగం మాత్రం ప్రవాహంలా కొనసాగుతోంది
ఎన్నికల ప్రచారమయినా లేక మరే ప్రసంగమయినా స్ర్కిప్ట్ అవసరం లేకుండానే ధారాళంగా ప్రసంగించగల సామర్థ్యం ప్రధాని మోడీ సొంతం. ఆయన చెప్పాలనుకున్న విషయాలపై ఆయనకు ఉన్న సంపూర్ణ అవగాహనే దీనికి కారణం. ఈరోజు ఎర్రకోట నుంచి కూడా ఆయన ప్రసంగం ఇలానే కొనసాగుతోంది. చేతిలో స్క్రిప్ట్ లేదు. జస్ట్ కొన్ని బుల్లెట్ పాయింట్లు తప్ప. అయతేనేం, ఆయన ప్రసంగం చిన్న తడబాటు కూడా లేకుండా కొనసాగుతోంది. 'ప్రధానిగా రాలేదు... ప్రధాన సేవకుడిగా వచ్చాను' అంటూ ప్రారంభమయిన ఆయన ప్రసంగం తూటాలు పేల్చినట్టు కొనసాగుతోంది. యువతకు విశ్వాసం నింపేలా సాగుతోంది. దేశానికి మార్గనిర్దేశం ఎలా చేయనున్నారో చెబుతోంది. గతంలో ఏ ప్రధాని కూడా స్క్రిప్ట్ లేకుండా ఎర్రకోట నుంచి ప్రసంగించలేదు. ఇది మోడీకి మాత్రమే సాధ్యమయింది.