: అమ్మాయిలు బయటకు వెళ్తే అడుగుతారు, అబ్బాయిలను ప్రశ్నించరా?: మోడీ
ఎర్రకోట ప్రసంగంలో మోడీ యువతపై పలు కీలక వ్యాఖ్యాలు చేశారు. అమ్మాయిలు బయటికి వెళ్లి ఆలస్యంగా వస్తే ప్రశ్నించే తల్లిదండ్రులు... అబ్బాయిలు బయటికి వెళ్తే మాత్రం ప్రశ్నించడం లేదని మోడీ అన్నారు. యువత... ముఖ్యంగా అబ్బాయిలు చెడు మార్గం పట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని మోడీ వ్యాఖ్యానించారు. అబ్బాయిల పెంపకంలో తల్లిదండ్రుల వహిస్తున్న అజాగ్రత్తే మహిళలపై జరుగుతోన్న దాడులకు ప్రధాన కారణమని మోడీ అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు తన మనసును కలచివేస్తున్నాయని మోడీ పేర్కొన్నారు.