: ప్రాణాలకు తెగించిన కానిస్టేబుల్


కేంద్రపాలిత ప్రాంతమైన చంఢీగఢ్ లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఓ కారును ఆపాడు. చంఢీగఢ్ లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇంతలో టయోటా సోనాటా కారులో ఓ వ్యక్తి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాడు. అది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ అతనిని ఆపే ప్రయత్నంలో కారుకు అడ్డంగా వెళ్లాడు. కానిస్టేబుల్ అడ్డం రావడం గమనించిన కారు యజమాని కారును అతనిపై నుంచి పోనివ్వబోయాడు. దీనిని గమనించిన కానిస్టేబుల్ కారు బోనట్ పైకి గెంతాడు. ఇది గమనించిన కారు యజమాని 170 కిలోమీటర్ల వేగంతో కారును పోనిచ్చాడు. బోనెట్ పై పడిన కానిస్టేబుల్ ఒడుపుగా కూర్చుని చేతిలోని హెల్మెట్ తో కారు అద్దాన్ని పగలకొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అది పగలలేదు. అలా కొంత దూరం తీసుకెళ్లిన కారు యజమాని కారును ఆపాడు. సరదాకి అలా చేశానని చెప్పాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంఢీగఢ్ పోలీసులు కారు నడిపిన వ్యక్తిపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. కాగా, కారులో యజమానితో పాటు మరో వ్యక్తి కూడా ఉండడం విశేషం. వారిపై ఇంతవరకు ఎలాంటి కేసులు లేవని చెప్పిన పోలీసులు, వారు మద్యం సేవించి కూడా లేరని తెలిపారు. ఈ రకమైన ప్రవర్తనతో వారు పోలీసు రికార్డులకెక్కారని అన్నారు.

  • Loading...

More Telugu News