: పెట్రోల్ ధర తగ్గుతోంది
దేశీయ చమురు కంపెనీలు ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ కానుకను ప్రకటించాయి. గురువారం అర్థరాత్రి నుంచి పెట్రోల్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్ పై 2 రూపాయల 38 పైసలు తగ్గిస్తూ చమురు కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో... హైదరాబాదులో లీటరు పెట్రోల్ ధర రూ.76.84గా ఉండనుంది.