: యాజిదీ... ప్రపంచంలోనే ప్రత్యేకమైన వ్యక్తి!


నడినెత్తిన భగభగమండే సూర్యుడు... ఈడ్చి మొహంపై కొట్టే ఈదురుగాలి... తీరని దాహార్తి...ఆగని ప్రయాణం ఇదీ యాజిదీల ప్రస్తుత పరిస్థితి. సైతానుని పూజిస్తారని ప్రపంచ వ్యాప్తంగా ముద్రపడిన యాజిదీలు ఇరాక్ పురాతన సంపద. వీరు మరొక మతం స్వీకరించరు. ఇతరులతో సంబంధాలు పెట్టుకోరు. యాజిదీలుగా జన్మించడమే తమ ప్రత్యేకతగా భావిస్తారు. సున్నీ వర్గానికి చెందిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వీరిపై దాడులు చేయడానికి తోడు, ఉంటే బానిసలుగా ఉండండి, లేదా చావండి అంటూ హెచ్చరించడంతో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని టర్కీవైపుగా పారిపోతున్నారు. కుర్ధుల ప్రాబల్యమున్న ప్రాంతానికి కానీ, టర్కీకి కానీ పారిపోతే బతికి బట్టకట్టవచ్చు. అక్కడికి వెళ్లాలంటే సింజార్ పర్వతం దాటాలి. దీంతో పర్వతం దాటేందుకు వేలాది మంది యాజిదీలు కాలినడకన బయల్దేరారు... కానీ, పర్వతం కింద ఉగ్రవాదులు కాపుకాశారు. దీంతో అటు పోలేక, వెనక్కి రాలేక చాలా మంది పర్వతంపైనే ఉండిపోయారు. దీంతో వీరి కోసం కుర్దులు హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభించారు. సద్దాం హుస్సేన్ లౌకిక వాది కావడంతో అన్ని మతాలవారు స్వేచ్ఛగా జీవించారు. అమెరికా ఇరాక్ లో ప్రవేశించింది. లౌకికవాదులు బలహీనమయ్యారు. దీంతో మధ్యయుగాల సంస్కృతిని అలవరచుకున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు యాజిదీలను ఊచకోత కోశారు. వందలాది మందిని మూకుమ్మడిగా చంపుతుండడంతో భీతిల్లిన యాజిదీలు బ్రతుకుజీవుడా అంటూ తరలిపోతున్నారు.

  • Loading...

More Telugu News