: ఆంధ్రుల తొలి రాజధాని చేరుకున్న చంద్రబాబు


స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రుల తొలి రాజధాని కర్నూలు చేరుకున్నారు. కర్నూలులో ఆయనకు అధికారులు, పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడివడిన తరువాత ఆంధ్ర రాజధాని కర్నూలు కావడం, కొత్తగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్ర పరిపాలన డేరాలలో కర్నూలు రాజధానిగా జరగడాన్ని పలువురు ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు. రాజధాని లేకుండా రెండోసారి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కర్నూలులో జరగనుండడం పట్ల కర్నూలు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కర్నూలు సిద్ధమైంది.

  • Loading...

More Telugu News