: ఊహించని విధంగా ఆమెను ఐఏఎస్ వరించింది
నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం చౌటుపల్లి గ్రామానికి చెందిన విశ్వశ్రీకి అనుకోకుండా ఐఏఎస్ లభించింది. ఈ ఉదయం కేటాయించిన సివిల్స్ కేటగిరీల్లో ఆమెను ఐఏఎస్ వరించింది. జూన్ లో ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో విశ్వశ్రీ 346వ ర్యాంకు సాధించింది. ఈ ర్యాంకుకు ఐఆర్ఎస్ వస్తుందని ఆమె ఆశించారు. అయితే సివిల్స్ లో సీట్లు పెంచడంతో ఆమెకు ఐఏఎస్ కేటాయించినట్టు అధికారులు ప్రకటించారు. ఊహించని విధంగా ఐఏఎస్ రావడంతో విశ్వశ్రీ హర్షం వ్యక్తం చేశారు.