: ఇరు రాష్ట్రాల ప్రజలకూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ నరసింహన్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రేపు (శుక్రవారం) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణలో హైదరాబాదు గోల్కొండ కోటలోనూ, ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు లోనూ పంద్రాగస్టు వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అంకిత భావానికి స్వాతంత్ర్య దినోత్సవం నిదర్శనమని గవర్నర్ అన్నారు. ఈ సందర్భంగా సమరయోదుల త్యాగాలను స్మరించుకుందామని ఆయన చెప్పారు.