: ఎంపీలపై జోకులేస్తే రేడియో జాకీలపై చర్యలే!


ఎఫ్ఎం ఛానళ్ల కార్యక్రమాల్లో ఎంపీలపై జోకులు వేస్తూ, వారిని అనుకరించే రేడియో జాకీలపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయానికొచ్చింది. రాజ్యసభలో ఈరోజు (గురువారం) సమాజ్ వాదీ ఎంపీ జయా బచ్చన్ ఈ అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంటు సభ్యులపై అనుచితంగా మాట్లాడే జాకీలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. "ప్రైవేటు ఎఫ్ఎం ఛానళ్లలో రేడియో జాకీలు ఉపయోగిస్తున్న భాష అభ్యంతరకరంగా ఉంది. పార్లమెంటుకు సంబంధించిన వార్తలను ఇస్తూనే వారు ఎంపీలను అనుకరిస్తున్నారు. దీనిపై మీరేమైనా చేస్తారా? లేదా? అని తెలుసుకోవాలని అనుకుంటున్నా" అని జయా కోరారు. ఇందుకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమాధానమిస్తూ, ఇది చాలా తీవ్రమైన అంశమన్నారు. ఆర్జేలు ద్వంద్వార్ధాలు వచ్చే పదాలను వాడుతున్నారని, వాటిపై ప్రభుత్వానికి కొన్ని ఫిర్యాదులు కూడా అందాయని చెప్పారు.

  • Loading...

More Telugu News