: పోలీసులపై ఉన్న అపోహలు తొలగించండి: నాయిని


ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై ఉన్న అపోహలను తొలగించేలా సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. ట్యాంక్ బండ్పై హైదరాబాద్‌ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీలో భాగంగా పోలీస్‌శాఖకు 300 బైక్‌లు, 100 ఇన్నోవాలను పోలీసు శాఖకు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘గతంలో మాదిరిగా సౌకర్యాలు లేవు, మా పరిధిలోనిది కాదు’ వంటి కుంటి సాకులు చెప్పే అవకాశం ఇక లేదని అన్నారు. సమస్య వచ్చిన తక్షణమే పోలీసులు స్పందించాలని ఆయన సూచించారు. తెలంగాణ పోలీసులు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకునేలా సౌకర్యాలు కల్పించామని ఆయన చెప్పారు. జంట నగరాల్లో నేరాల నిరోధానికి పోలీసులు పటిష్ఠ కృషి చేయాలని నాయిని సూచించారు.

  • Loading...

More Telugu News