: ప్రియాంక కొత్త సినిమాకు పన్ను రాయితీ దక్కేనా?


బాలీవుడ్ అందాలభామ ప్రియాంక చోప్రా నటించిన 'మేరీ కోమ్' చిత్రానికి పన్ను రాయితీ ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ మేరకు తాము పన్ను మినహాయింపు కోసం ప్రయత్నిస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థ వయాకామ్ 18 సీఓఓ అజిత్ అంధారే పేర్కొన్నారు. అంతా సవ్యంగా సాగిపోతే శుభవార్తను పంచుకుంటామని అజిత్ తెలిపారు. పన్ను రాయితీ లభిస్తుందనే భావిస్తున్నామని చెప్పారు. మేరీ కోమ్ చిత్రాన్ని విఖ్యాత మహిళా బాక్సర్ మేరీ కోమ్ జీవితప్రస్థానం ఆధారంగా తెరకెక్కించారు. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో మేరీ కోమ్ పాత్ర పోషించారు. కాగా, ఇంతకుముందు పరుగుల వీరుడు మిల్కాసింగ్ జీవితగాథతో తెరకెక్కిన 'భాగ్ మిల్కా భాగ్' చిత్రానికి మహారాష్ట్ర, బీహార్, యూపీ తదితర రాష్ట్రాలు పన్ను మినహాయింపునివ్వడం తెలిసిందే.

  • Loading...

More Telugu News