: శారదా స్కాం కేసులో పలుచోట్ల సీబీఐ సోదాలు


పదివేల కోట్ల రూపాయల శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు ఈరోజు 28 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ, కోల్ కతా, ఒడిశాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మాజీ మంత్రి మాతంగ్, మాజీ ఐపీఎస్ రజత్ మజుందార్ ఇళ్లలో, ఈస్ట్ బెంగాల్ క్లబ్ అధికారుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల కిందట కోల్ కతాలోని శారదా గ్రూప్ డైరెక్టర్స్ ఇళ్లలోనూ సోదాలు చేసిన సీబీఐ అధికారులు సీడీలు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News