: పోలీస్ శాఖలో కొత్త వాహనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్


హైదరాబాదు ట్యాంక్ బండ్ పై నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ శాఖకు కేటాయించిన కొత్త వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసులకు 100 ఇన్నోవాలు, 300 ద్విచక్రవాహనాలను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు పోలీస్ శాఖ తరఫున డీజీపీ అనురాగ్ శర్మ ధన్యవాదాలు తెలిపారు. పౌరుల రక్షణపై హైదరాబాద్ పోలీసులకు మరింత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, తెలంగాణ రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News