: ఆంధ్రజ్యోతి ఎండీకి అరెస్టు వారెంట్ జారీ
ఆంధ్రజ్యోతి పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు ఖమ్మం రెండో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా 'ఆంద్రజ్యోతి' పత్రికలో వార్త ప్రచురించారంటూ ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన పూసా నరేందర్ 2010లో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో విచారణకు బుధవారం రాధాకృష్ణ కోర్టుకు గైర్హాజరయ్యారు. దాంతో, న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.