: పైలట్ నిద్రపోయాడు, కో-పైలట్ ట్యాబ్ తో బిజీ... అప్పుడా విమానం పరిస్థితి..?


విమాన పైలట్లకు ఈ మధ్య కాక్ పిట్ లోకి వెళ్ళగానే బాగా నిద్రొస్తున్నట్లుంది! అలాంటి సంఘటనలు కొన్ని మీడియాలో వచ్చాయి కూడా. తాజాగా అలాంటిదే జెట్ ఎయిర్ వేస్ విమానంలో చోటుచేసుకుంది. సదరు విమానం ముంబయి నుంచి బ్రస్సెల్స్ వెళుతోంది. ఆ బోయింగ్ 777 ప్లేన్ టర్కీ గగనతలం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో పైలట్ ఓ కునుకేశాడు. అప్రమత్తంగా ఉండాల్సిన కో-పైలట్ ట్యాబ్ చూసుకుంటూ వేరే లోకంలో విహరిస్తోంది. అప్పుడు చూడండి ఆ విమానం పరిస్థితి..! ఒక్కుదుటున 5000 అడుగుల కిందికి జారిపోయిందట. ఈ విషయాన్ని ఆ మహిళా కో-పైలట్ గా గమనించలేదు. అయితే, టర్కీలోని అంకారా ఎయిర్ పోర్టు ఏటీసీ ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే విమాన సిబ్బందిని అప్రమత్తం చేసింది. 34,000 అడుగుల ఎత్తులో ప్రయాణించాల్సిన విమానం ఎందుకు ఆల్టిట్యూడ్ తగ్గించుకోవాల్సి వచ్చిందంటూ వివరణ కోరింది. అంకారా ఏటీసీ పిలుపుతో ఉలిక్కిపడిన కో-పైలట్ భామ వెంటనే పైలట్ మహాశయుణ్ణి నిద్రలేపి పరిస్థితి వివరించింది. దీంతో, ఏటీసీ సూచనలకు అనుగుణంగా వారు వెంటనే ఫ్లైట్ ఆల్టిట్యూడ్ ను 32,000 అడుగులకు తీసుకెళ్ళారు. ఈ సంఘటన గురించి భారత డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మంగళవారం తెలుసుకుంది. వెంటనే జెట్ ఎయిర్ వేస్ విమాన పైలట్, కోపైలట్ లకు సమన్లు జారీచేసింది.

  • Loading...

More Telugu News