: ఏపీలో బదిలీల జాతర
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల బదిలీల జాతరకు గురువారం తెరలేవనుంది. ఉద్యోగుల బదిలీలపై అమలవుతున్న నిషేధాన్ని ఈ నెల 14 నుంచి సెప్టెంబర్ 13 వరకు సడలించాలని ఇటీవల కేబినెట్ తీర్మానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బదిలీపై అమలవుతున్న నిషేధాన్ని నెలపాటు సడలిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల జారీతో రాష్ట్రవ్యాప్తంగా ఆయా శాఖల్లో బదిలీలకు అవకాశం చిక్కనుంది. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఉద్యోగుల బదిలీలకు అనుమతిస్తూ, మిగిలిన కాలంలో ఎలాంటి బదిలీలు చేయరాదని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తద్వారా ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలగకపోవడంతో పాటు ఉద్యోగులకూ ఇబ్బందులు ఎదురుకావు.