: బ్రెజిల్ లో నేలకూలిన విమానం...బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి మృతి
బ్రెజిల్ దేశంలోని ప్రధాన నగరమైన రియోడిజెనరోలో ఓ విమానం కూలింది. ఈ ప్రమాదంలో బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి ఎడ్వర్డో కాంపోస్ మరణించారు. రియోడిజెనరోలో ఉన్న శాంటోస్ ఎయిర్ పోర్ట్ నుంచి సావాపా నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రిమోడిజెనరో నగరం నుంచి బయలుదేరిన కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం సంభవించింది. ప్రయాణం ప్రారంభించిన కొన్ని నిమిషాలకే వాతావరణం అనుకూలించకపోవడంతో మళ్లీ శాంటోస్ ఎయిర్ పోర్ట్ లోనే విమానం ల్యాండ్ చేయడానికి పైలట్ ప్రయత్నించాడు. అయితే, ఈ లోపే వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడంతో విమానం జనావాసాల్లో నేలకూలింది. రిమోడిజెనరో నగరంలోని కొన్ని ఇళ్లు,ఓ జిమ్ పై ఈ విమానం కూలింది. ఈ ప్రమాదంలో ఎడ్వర్డో కాంపోస్ తో పాటు మొత్తం 7 మంది మృతి చెందారు.