: పొన్నాల, కిషన్ రెడ్డిపై మండిపడిన కేటీఆర్


తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తమ ఉనికిని కాపాడుకునేందుకే పొన్నాల సీఎంకి లేఖలు రాస్తున్నారని అన్నారు. విభజన చట్టం చదవకుండా, అవగాహన లేకుండా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. యూపీఏ నిర్ణయాలనే ఎన్డీయే కూడా అమలు చేస్తున్నప్పుడు ఇక కేంద్ర ప్రభుత్వం ఎందుకని ఆయన ప్రశ్నించారు. పొన్నాల, కిషన్ రెడ్డి అపోహలకు ఆస్కారమివ్వకుండా మాట్లాడాలని కేటీఆర్ హితవు పలికారు. చేతనైతే ప్రభుత్వానికి సహకరించాలని, లేని పక్షంలో మౌనంగా ఉండాలని ఆయన సూచించారు. కిషన్ రెడ్డి ఏమని ముఖ్యమంత్రికి లేఖ రాస్తారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదును వేరేవాళ్ల చేతిలో పెట్టమంటారా? అని నిలదీశారు. సోనియా తప్పుచేసిందని మాట్లాడే బీజేపీ నేతలు ఎందుకు సరిచేయడం లేదని కేటీఆర్ అడిగారు.

  • Loading...

More Telugu News