: ‘పొలం పిలుస్తోంది’ అంటోన్న ఏపీ మంత్రులు


చిత్తూరు జిల్లాలో జరిగిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రేణిగుంట మండలంలోని ఆర్.మల్లవరంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, బొజ్జల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... రుణమాఫీ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని అన్నారు. ఎంత త్వరగా రుణమాఫీ అమలు చేయాలన్న దానిపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారని ఆయన చెప్పారు. రుణమాఫీపై ప్రతిపక్షాలైన కాంగ్రెస్, వైఎస్సార్సీపీలకు మాట్లాడే అర్హత లేదన్న ఆయన... రుణమాఫీ అమలయ్యాక ఆ పార్టీలను ప్రజలే మాఫీ చేస్తారని అన్నారు.

  • Loading...

More Telugu News