: న్యాయమూర్తుల నియామక బిల్లుకు లోక్ సభ ఆమోదం
ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన న్యాయమూర్తుల నియామక బిల్లుకు లోక్ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు కానుంది. దేశంలోని పలు కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల వ్యవహారాలను ఈ కమిటీయే చూస్తుంది. ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థ స్థానంలో ఈ కమిటీ కొత్తగా ఏర్పాటవుతోంది. న్యాయవ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోందంటూ కొన్ని రోజుల కిందట ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్, జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇందుకు మద్దతు తెలిపిన కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని తీసుకొస్తోంది.