: బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేశారు


కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు... నయానో, భయానో అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ కి చెందిన వివాహిత (26) దగ్గర్లోని జానక్ పూర్ లో స్నేహితురాలి దగ్గరకు వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తుండగా లిఫ్ట్ ఇస్తామని, భయంలేదని మాయమాటలు చెప్పి బైక్ పై ఎక్కించుకున్నారు. తరువాత బిస్లరీ గ్రామానికి సమీపంలోని కాలువలోకి తీసుకెళ్లి ఆమెతో బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఆమెను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News