: విజయవాడ-గుంటూరును రాజధాని చేస్తే... కర్నూలును రెండో రాజధాని చేయాలి: చంద్రబాబుపై సీమ నేతల ఒత్తిడి


రాజధానిని తమ ప్రాంతానికి కేటాయించాలని రాయలసీమలో ఆందోళనలు తీవ్రతరం కావడంతో... ఆ ప్రాంత టీడీపీ నాయకులు చంద్రబాబు దగ్గర కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చారు. విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేసే పక్షంలో కర్నూలును రాష్ట్రానికి రెండో రాజధానిగా ప్రకటించాలని వారు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఉపముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తి రాజధాని కోసం రాయలసీమలో జరుగుతున్న ఆందోళనలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చంద్రబాబు వికేంద్రీకరణ మంత్రం పటిస్తూ... అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని ప్రకటిస్తున్నప్పటికీ... రాయలసీమలో రాజధాని డిమాండ్ ఎగసిపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో, రాజధాని డిమాండ్ తీవ్రమై... ప్రత్యేక రాయలసీమ డిమాండ్ కు దారితీయకుండా, కర్నూలును రెండో రాజధానిగా చేయడానికి చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకురావాలని ఆ ప్రాంత నేతలు భావిస్తున్నారు. ఈ దిశగా చంద్రబాబును ఒప్పించడానికి వారు పావులు కదుపుతున్నారు.

  • Loading...

More Telugu News