: గుంటూరు జిల్లాలో బయల్పడ్డ పురాతన ఆలయం... సంపద ఉండొచ్చని ప్రచారం!


గుంటూరు జిల్లాలోని చేబ్రోలు భీమేశ్వరాలయంలో పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టింది. ఈ తవ్వకాల్లో ఓ పురాతన ఆలయం బయటపడింది. ఈ విషయం తెలియగానే అక్కడ భారీగా సంపద ఉండే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఇప్పుడా ప్రాంతంలో ఈ విషయమై జోరుగా ప్రచారం సాగుతోంది. ఆలయం వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. కాగా, తమ తవ్వకాల్లో ఆలయం బయల్పడ్డ విషయాన్ని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఆ పురాతన ఆలయంలో నేలమాళిగలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News