: కాకినాడ పోర్టు వద్ద గ్యాస్ లీక్ కలకలం... పరుగులు తీసిన స్థానికులు
కాకినాడ పోర్టు వద్ద ఈ ఉదయం గ్యాస్ లీక్ కలకలం రేగింది. ఓ నౌక నుంచి పెద్ద ఎత్తున 'ఎయిర్' వస్తుండడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గ్యాస్ లీక్ అవుతోందని భావించి పరుగులు పెట్టారు. దీనిపై వెంటనే స్పందించిన అధికారులు, మరమ్మతుల్లో భాగంగా ఓడ నుంచి 'ఎయిర్' బయటికి వదులుతున్నారని వివరణ ఇచ్చారు.