: వారణాశిలో రెడీ అయిన మోడీ 'రామభవనం'
వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పార్లమెంటరీ కార్యాలయం రెడీ అయ్యింది. ఈ కార్యాలయానికి 'రామభవనం' అని పేరు పెట్టారు. ఆగస్ట్ 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. పసుపు రంగులో ఉన్న ఈ మూడంతస్తుల భవనంలో ఏర్పాటు చేయనున్న పార్లమెంటరీ ఆఫీస్ ను కేవలం వారణాసి నియోజకవర్గానికే పరిమితం చేయడం లేదు. వారణాసి నియోజక వర్గ ప్రజల సమస్యలు, అవసరాలు తీర్చడంతో పాటు... పూర్వాంచల్(ఉత్తర యూపీ) ప్రాంత ప్రజల సమస్యలను కూడా ఈ ఆఫీస్ పరిష్కరిస్తుందని వారణాసి నియోజకవర్గ మీడియా ఇన్ ఛార్జ్ సంజయ్ భరద్వాజ్ వెల్లడించారు.