: సింగపూర్, థాయ్ లాండ్ ను దాటేసిన కేరళ
సింగపూర్, థాయ్ లాండ్ దేశాలు ఈ రెండింటిని కేరళ రాష్ట్రం దేనిలో దాటేసిందా? అనేగా మీ అనుమానం. ఫేస్ బుక్ పేజీకి లైక్స్ సంపాదించడంలో కేరళ టూరిజం ఆ రెండు దేశాలను దాటేసింది. పర్యాటక రంగానికి ప్రసిద్ధి చెందిన కేరళ సోషల్ మీడియాలో పది లక్షల లైక్స్ సంపాదించింది. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాలైన సింగపూర్, థాయ్ లాండ్ లను మించి కేరళ లైక్స్ సంపాదించడం విశేషం. 2010లో కేరళ పర్యాటక రంగం ఫేస్ బుక్ పేజిని ప్రారంభించింది.