: సర్వేకు, స్థానికతకు సంబంధం లేదు: కేటీఆర్
ఈ నెల 19వ తేదీన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న సర్వేకు, స్థానికతకు ఎలాంటి సంబంధం లేదని ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కొన్ని మీడియా వర్గాలు సర్వేపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. సమగ్ర కుటుంబ సర్వేపై ఎలాంటి అపోహలొద్దని ఆయన సూచించారు. సంక్షేమ ఫలాలు సర్వే కారణంగా సరిగ్గా లబ్దిదారులకు చేరే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సర్వేలో ఆందరూ పాల్గొనాలని ఆయన కోరారు.