: జమ్మూ కాశ్మీర్లో ఉన్న తీవ్రవాదులెంతమందో తెలుసా?


జమ్మూకాశ్మీర్లో ప్రస్తుతం 200 మంది తీవ్రవాదులు తలదాచుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రమంత్రి కిరేన్ రిజిజు లోక్ సభలో లిఖిత పూర్వకంగా ఈ విషయం వెల్లడించారు. జమ్మూకాశ్మీర్లో 1995 నుంచి మిలిటెంట్ల సంఖ్య తగ్గుముఖం పడుతోందని ఆయన తెలిపారు. 1996లో 6,800 మంది మిలిటెంట్లు ఉండగా... 2013లో వారి సంఖ్య 240కి తగ్గిందని ఆయన వెల్లడించారు. 2014లో ఈ సంఖ్య 199గా ఉందని ఆయన చెప్పారు. జమ్మూకాశ్మీర్ లో పటిష్ఠ భద్రతను కొనసాగిస్తామని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News