: ఈసారికి ఖేల్ రత్న అవార్డు ఎవరికీ ప్రకటించడంలేదు
దేశ అత్యున్నత క్రీడా అవార్డు ఖేల్ రత్నను 2014-15 సంవత్సరానికి గానూ ఎవరికి ప్రకటించడంలేదు. ఈ మేరకు ఈసారి అవార్డును ఎవరికీ సిఫారసు చేయకూడదని ఎంపిక కమిటీ నిర్ణయించింది. పలువురు క్రీడాకారుల పేర్లు అవార్డు కోసం ఎంపికకు వచ్చినప్పటికీ కమిటీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అవార్డు ఏర్పాటు చేశాక ఎవరికీ ప్రకటించకుండా ఉండటం ఇదే తొలిసారి. కాగా, అర్జున అవార్డుకు పలు క్రీడా విభాగాలకు చెందిన 15 మందిని కమిటీ ఎంపిక చేసింది. అర్జున, ఖేల్ రత్న అవార్డుల ఎంపిక కమిటీ సభ్యుడిగా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ వ్యవహరిస్తున్నారు.