: ఎల్బీనగర్ లో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న జీహెచ్ఎంసీ
అక్రమ కట్టడాలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ మరోసారి పంజా విసిరింది. అయ్యప్ప సొసైటీ, గురుకుల్ ట్రస్టు భూముల్లో వెలసిన కట్టడాలను కూల్చేసిన అధికారులు, ఈసారి ఎల్బీనగర్ పై కన్నేశారు. ఎల్బీనగర్ లో అక్రమంగా వెలసిన కట్టడాలను అధికారులు యుద్ధప్రాతిపదికన కూల్చేస్తున్నారు. దీంతో ఓ బిల్డింగ్ యజమాని ఖాసింకు గుండెపోటు వచ్చింది. కష్టపడి నిర్మించుకున్న ఇల్లు కళ్లముందే కూలిపోవడం తట్టుకోలేని ఖాసిం తీవ్ర ఆవేదనకు లోనవ్వగా గుండెపోటు వచ్చింది. దీంతో అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.