: సమగ్ర సర్వేపై విచారణ రేపటికి వాయిదా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన తలపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. గెజిట్ నోటిఫికేషన్ లేకుండా సర్వే నిర్వహించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ప్రభుత్వం సేకరించే వివరాల్లో స్పష్టత లేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. బ్యాంకు ఖాతా, ఐటీ వివరాల సేకరణ అధికారం కేంద్రానికే ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.