: ఏపీకి కొత్త విద్యుత్ నియంత్రణ మండలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలిలో ఒక ఛైర్మన్, ఇద్దరు సభ్యులు ఉండనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ జెన్ కో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో ఏపీ జెన్ కో విద్యుత్ సంబంధిత పనులన్నీ చక్కబెట్టేది. రాష్ట్రం ముక్కలు కావడంతో తెలంగాణ విద్యుత్ మండలిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా ఏపీ కూడా విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం.