: ఇరాక్ సంక్షోభంలో కొత్త మలుపు... ప్రధానిగా అల్ అబాదీ
ఇరాక్ రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. తాజా ఎన్నికల్లో గెలుపొందిన ప్రస్తుత ప్రధాని అల్ మాలి అధికారాలను తనవద్దే ఉంచుకోవడంతో జాతుల మధ్య వైరం పెరిగి అంతర్యుద్ధం చెలరేగింది. దీనిని అదుపు చేసేందుకు ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలంటూ డిప్యూటీ స్పీకర్ హైదర్ అల్ అబాదీని ఇరాక్ అధ్యక్షుడు ఆహ్వానించారు. ఇదే సమయంలో అల్ అబాదీ ప్రధానిగా పదవీబాధ్యతలు చేపట్టి సంక్షోభానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కోరారు. దీనిపై ప్రస్తుత ప్రధాని నౌరీ అల్ మాలీకి మండిపడుతున్నారు.