: ఏపీకి తాత్కాలిక రాజధానిగా విజయవాడ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఎంపిక చేసినట్లు సమాచారం. రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక రాజధాని నుంచి పరిపాలనను నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనిపై సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. విజయవాడ కేంద్రంగా తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అధికారులను, శాఖాధికారులను తరలించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. నీటి పారుదల, మత్స్య శాఖ విభాగాలను విజయవాడకు తరలించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అనువైన ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాలను గుర్తించి సమాచారమివ్వాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.