: ట్రయల్ రూంలో బట్టలు మార్చుకుంటున్నారా? అయితే జాగ్రత్త పడండి...!
బట్టల షోరూంలోని ట్రయల్ రూంలో రహస్య కెమెరాలు అమర్చి మహిళలు దుస్తులు మార్చుకుంటుండగా దృశ్యాలు చిత్రీకరించిన ముగ్గురు కామాంధులను బెంగళూరు బసవనగుడి పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ బజారులోని విఠల్ దుస్తుల దుకాణాన్ని సందీప్, సురేష్ అస్తేకర్, సునీల్ అస్తేకర్ సోదరులు నిర్వహిస్తున్నారు. వీరి షాపులో బాషా అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఈ నెల 7న ఓ మహిళ ఆ షాపుకు వెళ్లి బట్టలు సరిపోయాయో లేదో సరిచూసుకునేందుకు ట్రయల్ రూంకు వెళ్లి బట్టలు మార్చుకుంటుండగా, ఓ చిన్న వైర్ కనిపించింది. జాగ్రత్తగా పరిశీలించగా సీసీ కెమెరా ఏర్పాటు చేసిన సంగతి గుర్తించింది. అక్కడ సీసీ కెమెరా ఎందుకు ఏర్పాటు చేశారంటూ విషయాన్ని యజమానుల దృష్టికి తీసుకురాగా, వారు నానా దుర్భాషలాడి వారిని బయటకు పంపించేశారు. వారు బంధువులతో వచ్చి వీడియోలోని తన భార్య బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలు తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో షాపు నిర్వాహకులు ఎదురుతిరిగి ‘మీ దిక్కున్నచోట చెప్పుకోండి’ అంటూ దురుసుగా సమాధానమిచ్చారు. దీంతో బాధితులు బసవగుడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా వారు బెయిల్ పై బయటకు వచ్చారు.