: రాజధాని సలహా కమిటీతో సమావేశమైన చంద్రబాబు
రాష్ట్ర రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక రాజధాని ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం రాజధాని సలహా కమిటీతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రాజధాని కోసం ప్రపంచ స్థాయి నిర్మాణం జరగాలని అన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా రాజధాని నిర్మాణం జరగాలని ఆయన ఆకాంక్షించారు.