: తమిళనాట మరో అమ్మ పథకం... అమ్మ బేబీ


తమిళనాట మరో అమ్మ పథకం ప్రారంభమైంది. అమ్మ క్యాంటీన్లు, అమ్మ చౌక వస్తు సరఫరా, అమ్మ నూనె, అమ్మ మంచినీరు, అమ్మ మందుల షాపుల సరసన మరో పథకం వచ్చి చేరింది. ‘అమ్మ బేబీ కిట్ కేర్’ పేరిట తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే శిశువులకు వెయ్యి రూపాయల విలువ చేసే 16 వస్తువులను కానుకగా ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా తమిళనాట 7 లక్షల కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. అమ్మ బేబీ పథకానికి ఏటా 67 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నాయి. ఇందులో టవల్, బేబీ డ్రెస్, బేబీ బెడ్, ప్రొటెక్షన్ నెట్, న్యాప్ కిన్, బేబీ ఆయిల్, షాంపూ సాచెట్, సోప్ బాక్స్, నెయిల్ క్లిప్పర్, టాయ్, ఓ గిలక్కాయ్ తో పాటు తల్లికి లిక్విడ్ హ్యాండ్ వాష్ సోప్ ఉంటుంది. తాజా పధకం పట్ల పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News